Sunday, May 19, 2024

2014 తర్వాత గౌడన్నలకు గౌరవం పెరిగింది

spot_img

హైదరాబాద్: రవీంద్రభారతిలో జై గౌడ్ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 373 వ జాతీయ వారోత్సవాలు జరిగాయి. ఇందులో మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్,గీత సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లే రవికుమార్ గౌడ్, స్వామిగౌడ్,బిక్షమయ్యా గౌడ్,ఆంద్రప్రదేశ్ ఎంపీ భరత్,పలు రాష్ట్రాలు ,పార్టీలకు చెందిన గౌడ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. మన జాతి పై ఏ విధమైన వివక్ష ఉందో అందరికి తెలియచెప్పాలని పిలుపునిచ్చారు. అధికారికంగా ప్రభుత్వం జయంతి,వర్ధంతి నిర్వహించుకునేలా ప్రభుత్వం జీవో ఇచ్చింది. బహుజన కులాల కోసం కొట్లాడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. సీఎం కేసీఆర్ ను అడగగానే ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటుకు ఆదేశాలు జారీచేశారని తెలిపారు.

ఒకప్పుడు కల్లు, నీరా అంటే చిన్నచూపు చూసేవారు. బెంజి కార్లలో వచ్చి నీరా తీసుకుపోతుంటే సంతోషంగా ఉంది. బహుజనులు అందరూ ఒక్కటే అని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. 2014 తర్వాత రాష్ట్రంలో గౌడ్స్ కి గౌరవం పెరిగింది. దేశంలో ఎక్కడా లేనివిదంగా వైన్స్ లో రిజర్వేషన్ ఇస్తున్నము.ఈ ప్రభుత్వం గౌడ్స్ కి ఎప్పుడు అండదండగా ఉంటుంది.’’ అని మంత్రి అన్నారు.

Latest News

More Articles