Friday, May 17, 2024

కేసీఆర్ ఆదరణను చూసి ఓర్వలేక కవితపై తప్పుడు ఆరోపణలు

spot_img

వనపర్తి జిల్లా: ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు జారీ చేయడానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఆక్షేపించారు. గురువారం నాడు ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా తీగలపల్లి సమీపంలోని ఏదుల రిజర్వాయర్ వద్ద మీడియాతో మాట్లాడారు.

మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని గత కొంత కాలంగా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న డిమాండ్ ను ఓర్వలేక ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చారు. ఆమెకు ఏ మాత్రం సంబంధం లేని అంశాన్ని తీసుకుని కావాలని ఇబ్బందులు పెడుతున్నారు. కెసిఆర్ కు కర్ణాటక, మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read.. రికార్డు సృష్టించిన చంద్రయాన్‌-3 లైవ్‌ స్ట్రీమింగ్‌.. యూట్యూబ్‌ ప్రశంసలు

ఇటీవల దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసి వారి మద్దతు కూడగట్టి పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని కవిత ప్రయత్నించారు. సీబీఐ, ఈడీ, ఐటీ లను అడ్డం పెట్టుకొని అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బిజెపి వాళ్లు కూలగొట్టారు. కవిత తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి తెలంగాణ పోరాటాన్ని ప్రపంచమంతా తెలిసేలా చేశారన్నారు.

మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఆమె చేసిన కృషి గొప్పది. మహిళల హక్కుల కోసం కవిత ఎంతగానో కృషి చేశారు. విజయ్ మాల్యా లాంటివారు లక్ష కోట్లకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి అక్కడ దర్జాగా జీవిస్తున్నారు కానీ కేంద్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లిక్కర్ స్కాం పేరిట ఆమెకు ఏ మాత్రం సంబంధం లేని కవితను అనవసరంగా భయపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

Also Read.. మోడీ రాజకీయ కక్షలో భాగమే ఈడీ నోటీసులు

కుటుంబాన్ని కట్టడి చేస్తే కెసిఆర్ ఆగుతారేమని బిజెపి భ్రమ పడుతున్నది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిన సీఎం కేసీఆర్ వీరి తాటాకు చప్పుళ్లకు భయపడరు. అనవసర బెదిరింపుల వల్ల వాళ్లే బలహీనం అవుతారు. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని పక్షాలు ఏకం అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు కవితకు ఏమైనా అయితే మహిళా లోకం అంతా అగ్నికణికలు అవుతారు. కవితకు అండగా దేశంలోని ప్రతి మహిళ బయటకు వస్తుందని మంత్రి తెలిపారు.

Latest News

More Articles