Monday, May 20, 2024

బీఆర్‌ఎస్‌‎కు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు

spot_img

కాంగ్రెస్‌ పార్టీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. 2023లో అతిపెద్ద జోక్‌ ఇదేనని ఎద్దేవా చేశారు. శాట్స్ చైర్మన్‎గా ఎల్బీ స్టేడియంలోని చాంబర్‎లో భాద్యతలు స్వీకరించిన ఆంజనేయ గౌడ్ ను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటిరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో సీఎం కేసీఆర్‌ విశాల దృక్పథంతో పనిచేస్తారని తెలిపారు. పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌ను తొలగించడం కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. దానితో తమకు సంబంధం లేదని వెల్లడించారు.

Latest News

More Articles