Monday, May 20, 2024

జనం గుండెల్లో కేసీఆర్

spot_img

సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకానికి మారుపేరని… ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను నెరవేర్చిన చరిత్ర ఆయనదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జనం గుండెల్లో కెసిఆర్ ఉన్నారని అన్నారు. సబ్బండవర్ణాల సంక్షేమం కోరెలా బీఆర్ఎస్ మేనిఫెస్టో తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హామీ ఇచ్చినవే కాకుండా ఇవ్వనివి కూడా అమలు చేసి… సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచేలా చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.

వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బీఫారం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని… ఆయన ఆశీర్వాదంతో, ప్రజల దీవెనలతో ఈమారు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరోమారు బీఆర్ఎస్ పార్టీ తన విజయం సాధిస్తుందని తెలిపారు శ్రీనివాస్ గౌడ్.

Latest News

More Articles