Friday, May 3, 2024

కులవృత్తుల అభివృద్ధికి అండగా తెలంగాణ ప్రభుత్వం

spot_img

హైదరాబాద్: మత్స్య వృత్తిపై మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా దీటి మల్లయ్య బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గణనీయంగా మత్స్య సంపద పెరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ చేపట్టాం. చేపల విక్రయాలు జరుపుకోవడానికి మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు అందించాం. చేపల వంటకాలపై మహిళా మత్స్యకారులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.

మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని మత్స్యకారులకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుంది. తక్కువ ధరకు చేపలను దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు. కులవృత్తుల అభివృద్ధికి అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైంది మత్స్య రంగం. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కులవృత్తుల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు.’’ అని మంత్రి తలసాని తెలిపారు.

Latest News

More Articles