Sunday, May 19, 2024

తలసానికి ఎంఐఎం పూర్తి మద్దత్తు

spot_img

సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నాలుగోరోజు ఆదివారం సనత్ నగర్ డివిజన్‌లో ఎంతో ఉత్సాహంగా సాగింది. ఏ ఇంటికెళ్లినా శ్రీనన్న మీకే మా ఓటు అంటూ ప్రకటిస్తున్నారు. అనేక అభివృద్ధి పనులు చేసి మా సమస్యలు పరిష్కరించిన మిమ్మల్ని ఈ సారి ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఎంతో అభిమానంతో మంత్రి చేతిలో చేయి కలిపి చెబుతున్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు సమస్యలతో సతమతమయ్యే వారని అన్నారు. 2014 తర్వాత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి ఎన్నికై ముఖ్యమంత్రిగా పని చేసిన మర్రి చెన్నారెడ్డి కూడా చేయలేని అభివృద్ధి పనులను తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేశామని చెప్పారు.

Latest News

More Articles