Sunday, May 19, 2024

తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలే

spot_img

సికింద్రాబాద్:- అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జైన్ సేవా సంఘ్‎కు ఉప్పల్ భగాయత్‏లో ప్రభుత్వం 2 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమి మంజూరు పత్రాన్ని సంఘం ప్రతినిధులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ‘తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు మా బిడ్డలే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి పక్షాలపై ED, CBIలతో వేధింపులకు పాల్పడుతుంది. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది. దేశంలో కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరు లేరు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్మాణం యాదాద్రి దేవాలయం. కేంద్ర ప్రభుత్వం వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తుంది’ అని మంత్రి తలసాని అన్నారు.

Latest News

More Articles