Saturday, May 18, 2024

సమైక్య రాష్ట్రంలో నిధుల కోసం ఇబ్బందులు పడ్డాం..

spot_img

సీఎం కేసీఆర్ ముందు చూపుతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్‎లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్ని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జడ్పీ చైర్ పర్సన్ హేమలత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.

Read Also: యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసిన యువకుడి అరెస్ట్

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘సమైక్య రాష్ట్రంలో నిధుల కోసం ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశాం. 33 జిల్లాలకు 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలోనే ఏడుపాయల దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏడుపాయల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశాం. సీఎం కేసీఆర్ ముందు చూపుతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయి. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎండాకాలంలో కూడా మత్తడి దుంకే పరిస్థితి వచ్చిందంటే అది సీఎం కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైంది. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను అభివృద్ధి చేశాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇచ్చాం’ అని మంత్రి అన్నారు.

Latest News

More Articles