Sunday, May 19, 2024

అక్టోబర్ 2, 5 తేదీలలో 36,884 మందికి ఇండ్ల పంపిణీ

spot_img

హైదరాబాద్: అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేసే కార్యక్రమం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో మరెక్కడా లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయం నుండి ఈ నెల 27 వ తేదీన నిర్వహించిన ఆన్ లైన్ డ్రా లో ఏమ్పికిమ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా లబ్దిదారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read.. కాంగ్రెస్ ను నమ్ముకుంటే 24 గంటల కరంటు పోయి.. 3 గంటల కరంటు ఖాయం

సొంత ఇల్లు లేని పేద, మద్య తరగతి ప్రజల కల ను సాకారం చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గొప్ప మనసుతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. 9600 కోట్ల రూపాయల వ్యయంతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఇండ్లను కూడా అత్యంత ఖరీదైన ప్రాంతాలలో నిర్మించినట్లు పేర్కొన్నారు. 2 బెడ్ రూమ్ లు, కిచెన్, హాల్ తో కూడిన ఇంటి నిర్మాణంతో పాటు డ్రైనేజీ, విద్యుత్, వాటర్ వంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు.

Also Read.. రేవంత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి

లబ్దిదారుడి పై ఒక్క రూపాయి భారం లేకుండా ఇండ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. నిర్మించిన ఇండ్లను కూడా ఎంతో పారదర్శకంగా, రాజకీయ జోక్యం లేకుండా ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి లబ్దిడ్డారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్మించిన ఇండ్లలో మొదటి విడత లో 11,700 మంది అర్హులకు పంపిణీ చేయగా, రెండో విడతలో 13,200 మందికి పంపిణీ చేసినట్లు చెప్పారు. 3వ విడత లో 36,884 లబ్దిదారుల ఎంపిక చేయడం జరిగిందని, వీరికి అక్టోబర్ 2, 5 తేదీలలో రెండు విడతలలో ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఆయా తేదీలలో ఎక్కడ ఇండ్లను పంపిణీ చేస్తారు, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి చేస్తున్న ఏర్పాట్లపై మున్సిపల్, రెవెన్యు అధికారులు మీకు తెలియజేస్తారని మంత్రి లబ్దిదారులకు వివరించారు.

Latest News

More Articles