Monday, May 20, 2024

తెలంగాణ అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం.. ఏర్పాట్లపై మంత్రి వేముల సమీక్ష

spot_img

హైదరాబాద్: సీఎం కేసిఆర్ గారి ఆదేశాల మేరకు..హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈనెల 22న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ముగింపు రోజున “తెలంగాణ అమరుల స్మారక చిహ్నం” ముఖ్యమంత్రి కేసిఆర్ ఆవిష్కరిస్తారని తెలిపారు. అందుకు సంబంధించిన ప్రోగ్రాం రూట్ మ్యాప్, తదితర ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఈ సందర్భంగా నిర్వహించే సభ, అతిథులకు ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బోయి, ఈఎన్సి గణపతి రెడ్డి,ఐ అండ్ పిఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి,ఆర్ అండ్ బి ఎస్.ఈ హఫీజ్, ఈ.ఈ నర్సింగరావు, పలువురు పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles