Saturday, May 18, 2024

హైదరాబాద్‌లో ఘనంగా తెలంగాణ 2కే రన్‌

spot_img

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో  భాగంగా ఇవాళ(సోమవారం) హైదరాబాద్‌లో తెలంగాణ 2కే రన్‌ను  ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌ లోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్‌ ను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషా సింగ్‌, గాయకులు మంగ్లీ, రామ్‌ మిర్యాల, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. అంతేకాదు.. నాలుగు వేలకుపైగా రన్నర్లు ఈ రన్‌లో పాల్గొన్నారు. సింగర్స్‌ మంగ్లీ, రామ్‌లు తమ పాటలతో రన్నర్లలో హుషారు నింపారు.

Latest News

More Articles