Saturday, May 11, 2024

వ‌రల్డ్ క‌ప్ ట్రోఫీపై మరోసారి మిచెల్ మార్ష్ బరితెగింపు మాటలు!

spot_img

న్యూఢిల్లీ: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా ఆరోసారి ట్రోఫీ నెగ్గిన విష‌యం తెలిసిందే. అనంతరం వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీపై ఆసీస్ ఆల్ రౌండ‌ర్ మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టిన ఫోటో నెట్టింట వైర‌ల్ అయింది. మార్ష్ చేసిన ఈ పనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వచ్చాయి.

ఈ ఘటనపై క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట‌ర్లు, విశ్లేష‌కులు కూడా త‌ప్పుబ‌ట్టారు. తాజాగా మరోసారి మార్ష్ వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. ఆస్ట్రేలియాకు చెందిన సెన్ రేడియో నెట్వ‌ర్క్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మార్ష్ మాట్లాడుతూ… ఆ ఫోటోలో ఎలాంటి అగౌర‌వం లేదని చెప్పాడు. అసలు తాను దాని గురించి ఆలోచించ‌నేలేదని, సోష‌ల్ మీడియాను ఎక్కువగా చూడనని పేర్కొన్నాడు. అందులో తనకైతే ఎలాంటి త‌ప్పూ క‌నిపించ‌డం లేదన్న మార్ష్.. వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీపై మ‌ళ్లీ కాళ్లు పెట్టేందుకు త‌న‌కేం అభ్యంత‌రం లేద‌ని వ్యాఖ్యానించ‌డంపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Latest News

More Articles