Monday, May 20, 2024

పదవికి వీడ్కోలు చెప్తూ.. హరీష్ రావు ఎమోషనల్

spot_img

సిద్దిపేట నియోజకవర్గ సర్పంచ్, ఉప సర్పంచ్ ల ఆత్మీయ సత్కారం లో పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సర్పంచ్, ఉప సర్పంచ్ లతో మాట్లాడుతూ..గ్రామంలో పంచాయితీ లు, గొడవలకు సర్పంచ్ నే పెద్ద మనిషి. ఇరు వర్గాలు నిత్యం కళ్ళముందే ఉంటారు. ఎవరి వైపు తీర్పు చెప్పినా ఇంకొకరికి కంటు కావలసిందే. అవతలి వ్యక్తి ముఖం మీదనే నాలుగు మాటలు అని పోతాడు. అన్నీ చక్కదిద్దుకుంటూనే మళ్ళీ అభివృద్ధి ని చూసుకోవాలి. పథకాలు అందకుంటే సర్పంచ్ కే తిప్పలు. అభివృద్ధి పని చేయకున్నా ఇబ్బందే. ఎంత కష్టపడినా నూటికి నూరు శాతం ప్రజలను సంతృప్తి పరచలేము. మన సిద్దిపేట నియోజకవర్గ సర్పంచ్ లు అల్ రౌండర్లు. అన్నీ పనుల్లో నూ యాక్టివ్ గా ఉన్నారు.

కరోనా కష్ట కాలం లో ప్రజలకి అండగా ఉన్నారు. కరోనా తో చనిపోతే దహన సంస్కారాలు దైర్యం గా చేపించారు. ప్రజా సేవలో మీ పటిమ ఎల్లప్పుడూ ఉంటుంది. ఎన్నో పనులు పట్టుదల తో సాదించుకున్నారు.. మీరు అంత నా కుటుంబ సభ్యులు.. మీకు కష్టం వస్తే నేను ఉన్న… నాకు కష్టం వస్తే మీరు ఉన్నారు. మీకు అన్నింటి కి ఆండగా ఉంటా. మన ప్రభుత్వం మన రాష్ట్రం లో మీ సారథ్యం లో అద్భుతమైన ప్రగతి సాదించుకునం. సర్పంచ్ ల పదవి గడవు పొడగింపు ఫై పార్టీ తరుపున ప్రభుత్వం ని కోరుతం. మీరు సర్పంచ్ పదవి నె కాదు ఇంకా మంచి పదవులు పొందాలని ఆశిస్తున్నా. పదవి వీడ్కోలు శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.

Latest News

More Articles