Sunday, May 19, 2024

ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్‌ఎస్‌

spot_img

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా గిరాకీ లేక ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి. ఆర్ధిక ఇబ్బందులతో ఇప్పటివరకు 18 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా తాను ఆటోలో అసెంబ్లీకి వచ్చానని, అయితే ఆటోను లోపలికి అనుమతించలేదని చెప్పారు. ఆటోను ఎందుకు లోనికి రానివ్వలేదని ప్రశ్నించారు? కార్లో వస్తేనే రానిస్తారా? అని అన్నారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే ఆయనను భద్రతా సిబ్బంది ఆటోలో లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆటోలకు అసెంబ్లీలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ ఛాంబర్‌ను మార్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది

Latest News

More Articles