Friday, May 17, 2024

మొదటిరోజే ఉలిక్కిపడితే ఎట్లా? కేసీఆర్ చెప్పారని ఆగుతున్నాం..

spot_img

తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మొద‌టి రోజే ఇంత భ‌య‌ప‌డితే ఎట్ల‌..? మంత్రులు ఉలిక్కి ప‌డ‌టం స‌రికాదు అని కేటీఆర్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

Read Also: కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్ర భ‌విష్య‌త్ ఎట్లా ఉండ‌బోతుందో మాకు అర్థ‌మైంది

‘ప‌దేండ్లు విధ్వంసం జ‌రిగింద‌న్నారు. మ‌రి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది. జీవ‌న విధ్వంసం చెప్పాలి. ప‌రిగి ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరు ప్ర‌స్తావించారు. గ‌త ముఖ్య‌మంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్ర‌భాక‌ర్ ఏపీ చ‌రిత్ర మాట్లాడొద్దు అంటారు. పాపం వారి స‌భ్యుడే వారిని ఇరికిస్తున్నారు. వాస్త‌వాలు చెప్పాలి క‌దా..? సాగునీరు, తాగునీరు, క‌రెంట్ ఇవ్వ‌లేని అస‌మ‌ర్థ‌త గురించి చెప్తే ఉలికిపాటు ఎందుకు..? ఇది మొద‌టి రోజు. మొద‌టి రోజే ఇంత భ‌య‌ప‌డితే ఎట్ల స‌ర్.. ఒక్కోక్క మంత్రి లేచి ఉలిక్కి ప‌డి మాట్లాడుతున్నారు. నిర్మాణాత్మ‌క‌మైన సూచ‌న‌లు త‌ప్ప‌కుండా చేస్తాం. కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చింది తొంద‌ర‌ప‌డ‌కండి.. ఒక మూడు నెల‌లు స‌మ‌య‌మిద్దాం.. ఎట్లాగు అట్ట‌ర్ ప్లాప్ అయితారు. కానీ మూడు నెల‌లు స‌మ‌యం ఇద్దాం అని కేసీఆర్ చెప్పారని ఆగుతున్నాం’ అని కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles