Tuesday, May 21, 2024

సీఎం సిద్దరామయ్య వీడియో చూపెట్టి.. కాంగ్రెస్ ని కడిగేసిన కేటీఆర్

spot_img

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఓ ప్రశ్న సంధించారు. హామీల అమలుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. అసెంబ్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లకోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? అని పేర్కొన్నట్లు ఉంది. ఈ వీడియోను కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారు.. అలాంటప్పుడు హామీల ప్రకటన ఇచ్చే ముందు ఆలోచన చేయరా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా? అని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

Latest News

More Articles