Friday, May 17, 2024

వీధి వ్యాపారులను వేధిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలె..

spot_img

జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ అధికారులు రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించడంపై స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: ప్రచార ఆర్భటానికే రేవంత్ దావోస్ పర్యటన

రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న నిరుపేదలపై మల్కాజిగిరి సర్కిల్ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్ట్రీట్ వెండర్స్ చట్టాలను ఉల్లంఘిస్తూ వారి వాణిజ్యసముదాలను కూలగొట్టారని స్ట్రీట్ వెండర్స్‎తో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. జోనల్ కమిషనర్ వచ్చి మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ పై చర్యలు తీసుకునే వరకు తమ దీక్ష కొనసాగుతుందని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి అన్యాయ చర్యలకు పాల్పడుతున్న సర్కిల్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, వారికి మద్దతు పలుకుతున్న పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Latest News

More Articles