Saturday, May 18, 2024

సీఎం రేవంత్ రెడ్డి సంచలనం కోసం ఏదో ఒకటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు

spot_img

సీఎం రేవంత్ రెడ్డి పబ్లిసిటీ స్టంట్ కోసం ఏదో ఒకటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని తీవ్రంగా ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన పాడి…రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడటం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కించపరిచి మాట్లాడడం తగదు.రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన పనులు తాను చేసినట్టు చెప్పుకుంటున్నాడు.రేవంత్ చేసే పనులను చూసి యావత్తు  తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు భర్తీకి శ్రీకారం చుడితే.. ఇప్పుడు ఆ ఉద్యోగాలు దానేదో భర్తీ చేసినట్టు పదేపదే చెప్పుకుంటూ అబద్ధాలాడుతున్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాకుండా మీరు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. వెంటనే జాబ్ క్యాలెండరు విడుదల చేయాలి. నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు.

మాజీ మంత్రి హరీశ్ రావును ఔరంగజేబు అని సీఎం రేవంత్ రెడ్డి అనడం తగదన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.మీకు చేతకాకపోతే ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయండి నేను చేసి చూపేడతానని హరీష్ రావు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీగా మీరు ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. మీ పార్టీది లోనే ఔరంగాజేబులు ఉన్నారు.. మీ మంత్రులు, ఎమ్మెల్యే రివర్స్ అయ్యే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఓటుకు నోటు కేసు ట్రైల్ పూర్తి అయితోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జైలు పోక తప్పదు ఆ ప్రెస్టేషన్లో లో సీఎం రేవంత్ ఏదో మాట్లాడుతున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు అబద్ధాలు అడుగుతున్నాడు ఇంగ్లీషులో అబద్ధాలు ఆడే వారిని పాథలాజికల్ లాయర్ అంటారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

ఇది కూడా చదవండి: ఎల్‌ఓసీలో పాకిస్తాన్ డ్రోన్స్ కలకలం..అప్రమత్తమైన భద్రతాబలగాలు..!!

Latest News

More Articles