Monday, May 20, 2024

బీఆర్ఎస్ పార్టీకి 90 సీట్లు

spot_img

వేలేరు మండలంలోని పిచరలో BRS పార్టీ గ్రామ స్థాయి విస్తృత సమావేశంలో సుమారు 100 మంది బిజెపి కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 90 సీట్లకు పైగా సాధిస్తుంది. మూడోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ ఇచ్చిన ఆరు హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అమలు చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్లు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు 3000 వితంతువులకు వృద్ధులకు 2000 ఆసరా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.

ఇక బీజేపీ పార్టీ తెలంగాణలో రెండు మూడు సీట్లకే పరిమితం అవుతుంది. బిజెపి పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటూ అంత మంచిది. బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో కూడా 600 పెన్షన్ మాత్రమే ఉంది.బీజేపీ ఇది విధానాలు నచ్చకని ఈరోజు పిచర గ్రామం నుండి సుమారు 100 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించి అగ్రగామిగా ఉంది. సీఎం కేసీఆర్ తోనే తెలంగాణకు శ్రీరామరక్ష, సుభక్షంగా ఉంటుంది.

Latest News

More Articles