Sunday, May 19, 2024

సీఎం రేవంత్‌ అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు

spot_img

సీఎం రేవంత్‌ రెడ్డి అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌ డీఎన్‌ఏలోనే మోడీతో స్నేహం ఉందని చెప్పారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు.

సాగునీరు,తాగునీరు ఇవ్వలేం అని సీఎం అంటున్నారు. నెత్తిమీద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. ప్రజా పాలనలో బీసి మేజర్ కులాలకు ప్రాధాన్యత లేదు. మున్నూరు కాపు,ముదిరాజ్,యాదవ సామాజిక వర్గాల నుండి క్యాబినెట్ లో మంత్రి లేడని అన్నారు కవిత.

బీజేపీ సపోర్ట్ తో 10 ఏళ్లు ఉంటా అని అంటున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి అంతు చూస్తా అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయనపై కేసులు పెట్టాలి. కేసీఆర్ నియంత అని మాట్లాడారు..ఆ మేధావులు ఇప్పుడు నిర్భందాలపై మాట్లాడట్లేదు. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా నిలవబోతుంది రేవంత్ సర్కార్ అని అన్నారు.

బీసీ కులగణన తీర్మానం చేశారు..చట్ట బద్దత లేదు. మహిళకు తీవ్ర అన్యాయం చేస్తూ జీఓ 3 ఇచ్చారు. ఫిబ్రవరి 6 న కోర్టు ఉత్తర్వులను ఎందుకు అప్పీల్ చేయలేదు…మీకు మహిళలపై చిత్త శుద్ది లేదు.సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ధర్నాచౌక్ లో పర్మిషన్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా రేపు(శుక్రవారం) జాగృతి అధ్వర్యంలో దీక్ష చేసి తీరుతాం.ఎంపీ గా పోటీ చేయాలని పార్టీ నిర్ణయంపై కట్టుబడి ఉంటా. అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఒడిస్తా..మొన్న కోరుట్లలో ఒడించా..ఎంపీ ఎన్నికల్లో అదే..అది ఎప్పుడూ పర్మినెంట్ అజెండా. ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన ఇది. యు ట్యూబ్ చానెల్ మీద తీవ్ర కేసులు పెడుతున్నారు. పిల్లల శవాలు చూస్తుంటే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నాయి. రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను బొంద పెట్టాలని చూస్తున్నాయి. కాంగ్రెస్,బీజేపీ ఎంపీలు ఎన్నడూ తెలంగాణ సమస్యల మీద పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఎప్పుడూ తెలంగాణ కోసం కేంద్రాన్ని ప్రశ్నించింది గులాబీ సైనికులైన బీఆర్ఎస్ ఎంపీలు. సోనియా గాంధీకి రాసిన లేఖ మీద రిప్లై వస్తుందని అనుకోవట్లేదు..అయినా బలి దేవత రిప్లై ఇస్తదా అని అన్నారు. సీతక్క కు డిప్యూటీ సీఎం ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళ అయిన సీతక్క కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అని అన్నారు. అనుభవరాహిత్యం,అవగాహన లోపం తో సీఎం రేవంత్ పాలన ఉంది. అట్లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన ఖర్మ. లిక్కర్ కేసు..పెద్ద కేసు కాదు. కేసును టీవీ సీరియల్ కేసు లెక్క లాగుతున్నారు.నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు.  మా లీగల్ టీం దాన్ని చూసుకుంటుంది. నేను బాధితురాలిని ఫైట్ చేస్తా అని తెలిపారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి:కేజ్రీవాల్‌కు మరోసారి సమన్లు జారీ..!

Latest News

More Articles