Sunday, May 19, 2024

అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానం తూతూ మంత్రంగా చేశారు

spot_img

అగ్రవర్ణాల కు సంభందించిన సీఎం రేవంత్ ఇవ్వాళ యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని, మంత్రి కొండా సురేఖను  అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టారని.. ఇది  చాలా దౌర్భాగ్యమన్నారు. ఇవాళ(సోమవారం) నల్గొండలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొని మాట్లాడారు కవిత. సీఎం  రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి. అసెంబ్లీ లో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతిపత్రం ఇస్తే ఆనాడు కూడా   దళితుడుకి వినతిపత్రం ఇచ్చారు అని రేవంత్ అవమానించారు. అప్పుడు ఓపిక పట్టినం…ఇవాళ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడయిన భట్టిని రేవంత్ అవమానించారు. సీఎం..భట్టికి, కొండా సురేఖకు  క్షమాపణలు చెప్పాలి.

మహిళకు 47శాతం రిజర్వేషన్ల తో ఉద్యోగాలు ఇచ్చాం అని సీఎం రేవంత్  అబద్ధాలు చెప్పారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. గురుకులాల్లో  85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ జీవో ఇచ్చారు… దాన్ని కాంగ్రెస్ వాళ్లు  తీసేసారు. సీఎం చెప్పేవాన్ని అన్ని అబద్ధాలే..యువతను మభ్యపెట్టాలని చూస్తున్నారు. విద్యార్థులను  మోసం చేయొద్దని కోరారు.

బీసీలకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలి….అందుకే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. కులగణన విషయంలో కాలయాపన చేయొద్దు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకంటే ముందే  42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో బీసీలకు చోటు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వం లో కనీసం ఒక్కరైనా బీసీ సలహాదారులు ఉన్నారా..ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ సలహాదారులు లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు. కాంగ్రెస్ దే కుటుంబ పాలన, కుటుంబాల వ్యవస్థ అని అన్నారు. నల్గొండ జిల్లా లో నల్గొండ ఎంపీ గా రఘువీర్ కి సీట్ ఇవ్వటమే దీనికి నిదర్శనమన్నారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి:సినీపరిశ్రమలో విషాదం..డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత.!

Latest News

More Articles