Sunday, May 12, 2024

కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దు

spot_img

కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్‌ను నమ్ముదామా.. లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా అనేది ఆలోచించాలని కోరారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేట్ మండలంలో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు కవిత. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించవని విమర్శించారు. నిత్యం తెలంగాణ ప్రజల బాగు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ తేలు వంటిదని.. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అంటున్నదని, 10 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: కుత్బుల్లాపూర్‌కు మెట్రో తీసుకొస్తాం

కర్ణాటకలో అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదని, పెన్షన్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు అందిస్తామని ప్రకటించారు. ఆర్థిక భారం తగ్గించాలన్న ఉద్దేశంతో రూ.1200 గా ఉన్న గ్యాస్ సిలిండర్ ను రూ. 400 కే సబ్సిడీ కింద ఇస్తామని అన్నారు. జీవన్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కవిత.

ఇది కూడా చదవండి: వెయ్యి కోట్లతో కొండగట్టు అంజన్న ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా

Latest News

More Articles