Sunday, May 19, 2024

ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి మహిళల ఉద్యోగాల్లో కోత విధించారు

spot_img

హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ కవిత.. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా మణులందరికి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ వలన మహిళలకు అనేక హక్కులు కల్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 33 శాతం రిజర్వేషన్ ను పెంచుకున్నాం. ఆడపిల్లలకు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఏదైనా సాధిస్తారని తెలిపారు. కేసీఆర్ ఉన్నప్పుడు లక్ష పైగా ఉద్యోగాలు కల్పించుకున్నాం. అందులో ముఖ్యంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించుకున్నామని తెలిపారు. మరి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు వ్యక్తి గతంగా చనిపోయిన అడబిడ్డలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయంలో ఉద్యోగాల విషయంలో జీఓ తీసుకొచ్చిన దాన్ని పట్టుకొని ఇప్పుడు మేమే ఇచ్చినం అని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి మహిళల ఉద్యోగాల విషయంలో కోత విధించడం మన దురదృష్టమన్నారు. జీఓ 3ని రద్దు చేసి.. మహిళలకు 33 శాతం వెంటనే రిజర్వేషన్ కల్పించేవరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ప్రజాపాలన అని పెట్టి రోజు కలుస్తా అని చెప్పి మాట తప్పిండు రేవంత్ రెడ్డి. ఎంతసేపు ఢిల్లీకి పోయి సోనియా గాంధీ , రాహుల్ గాంధీకి హాజరు వేసి వస్తాడని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. వికలాంగులకు, మహిళలకు తోడు ఉండకుండా ఎవరికి తోడు ఉంటున్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమ్మర్ వస్తుంది.. ఇప్పటికే కరెంట్ కోతలు వచ్చాయి… దీనికి తోడు నీటి కొరత కూడా రాబోతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 24 నీళ్లు ఇయ్యడం పోయి అదే ప్రాజెక్టు పై అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి: ఎన్నికల్లో ఇవ్వని హామీను కూడా మేము అమలు చేశాం

Latest News

More Articles