Sunday, May 19, 2024

వచ్చి అంకాపూర్ చికెన్ తినేసి వేళ్ళు.. ఆయన రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ.. కవిత వరుస సెటైర్స్

spot_img

రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్లు విసిరారు. నిజామాబాద్ కు వచ్చి తిరిగి చూడాలని…కానీ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టొద్దని హితవు పలికారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలపై రాహుల్ గాంధీ ఒక్కసారైనా పార్లమెంట్ లో మాట్లాడారా..? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బుధవారం బోధన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ పై ప్రశ్నించారు.

రాహుల్‌ గాంధీ ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి వెళ్తున్నారని.. ఆయన పేరు ఎన్నికల గాంధీ అని పెట్టుకోవాలంటూ కామెంట్స్ చేశారు కవిత. నిజామాబాద్ లో పర్యటించనున్న రాహుల్ గాంధీ… ఇక్కడ ఉన్న అంకాపూర్ చికెన్ రుచి చూడొచ్చని… కానీ ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దని హితవు పలికారు. పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు.. వెళ్లొచ్చు అంటూ సెటైర్లు విసిరారు కవిత. కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్‌లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిందని విమర్శించారు.

Latest News

More Articles