Sunday, May 19, 2024

ధర్నాచౌక్‌లో దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ కవిత

spot_img

మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఇవాళ హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టారు ఎమ్మెల్సీ కవిత. ఉదయం 11 గంటల ప్రారంభమైన ఈ దీక్ష యంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జీవో నంబర్‌ 3ను రద్దు చేయాలని డిమాండ్‌ చేయనున్నారు. ఈ జీవో కారణంగా ప్రభుత్వ నియామకాల్లో మహిళల రిజర్వేషన్ల అమలులో తీవ్ర అన్యాయం జరుగుతుందని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు జీవో-3 వల్ల జరిగే నష్టం గురించి ధర్నాల్లో వివరించనున్నారు.

రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత నిన్న(గురువారం) మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డలకు తరతరాలపాటు నష్టం జరిగే విధంగా ఈ ప్రభుత్వం జీవో-3ను జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అనుమతి లభించకపోయినా ధర్నా చేసి తీరుతామని ఆమె తేల్చి చెప్పారు.  అయితే  ఇవాళ( శుక్రవారం) ఉదయం కవిత దీక్షకు పోలీసులు అనుమతి జారీచేశారు.

ఇది కూడా చదవండి:

Latest News

More Articles