Tuesday, May 21, 2024

పాకిస్తాన్ కు చెప్పే బాలాకోట్ దాడులు.!

spot_img

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ లో భారత్ జరిపిన వైమానిక దాడులు యావత్ ప్రపంచం చూపు దేశంవైపు తిప్పేలా చేసాయి. పుల్వామా దాడికిప్రతికారంగా..ముష్కరులకు మన వాయుసేన ముప్పుతిప్పలు పెట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించింది. తాజాగా ఎన్నికల్లోనూ ఈ ఘటన మరోసారి తెరపైకివచ్చింది. ఈ దాడులపై ప్రధాని మోదీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలాకోట్ పై వైమానిక దాడుల గురించి పాకిస్తాన్ కు ముందే సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు వెల్లడించామని ప్రధాని తెలిపారు.

కర్నాటకలోని బగల్ కోట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈ ఘటన గురించి ప్రస్తావించారు. ఇది నవ భారత్. మనకు హానీ తలపెట్టే ఉగ్రవాదులు వారి సొంతదేశంలో నక్కినా వెంబడించి వేటాడి మరీ చంపేస్తాం. వెనక నుంచి దాడి చేయడంతో మోదీకి ఏ నమ్మకం లేదు. శత్రువుతో ఎదురుగా నిలబడే పోరాడుతాం. 2019 నాటి బాలాకోట్ దాడుల సమాచారాన్ని దాయాది నుంచి దాచిపెట్టలేదు. దాడి తర్వాత అక్కడ జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందే చెప్పాం అని ప్రధాని మోదీ తెలిపారు.

బాలాకోట్ వైమానిక దాడుల గురించి మీడియాను పిలిచి వెల్లడించాలని నేను మన బలగాలకు చెప్పాను. అయితే అంతకంటే ముందు పాకిస్తాన్ కు ఈ విషయం చెప్పాను. ఆ రోజు రాత్రి దాయాది దేశ అధికారులకు ఫోన్ చేస్తే వారు అందుబాటులోకి రాలేదు. అందుకని బలగాలను మరికొద్ది సేపు వేచి ఉండమని చెప్పాను. పాకిస్తాన్ దీని గురించి చెప్పిన తర్వాతే ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించం. మోదీ ఏ విషయాన్ని దాచి పెట్టడు. ఏది చేసినా బహిరంగంగా చేస్తాడు అంటూ నాటి సంఘటనలను ప్రధాని కూలంకషంగా వివరించారు.

ఇది కూడా చదవండి: కొవిషీల్డ్‌తో సైడ్‌ఎఫెక్ట్స్‌ నిజమే..మొదటిసారి అంగీకరించిన ఆస్ట్రాజెనెకా .!

Latest News

More Articles