Tuesday, May 21, 2024

5 రోజుల్లో మస్క్ సంపద ఎంత పెరిగిందో తెలుస్తే షాకే.!

spot_img

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంపద ఈమధ్య భారీగా పెరిగింది. గత ఐదు ట్రేడింగ్ సేషన్లలో మస్క్ 37.3 బిలియన్ డాలర్లు ఎగిశాయి. 2022 మార్చి తర్వాత ఒక వారం వ్యవధిలో ఆయన ఈ స్థాయిలో లబ్ధిపొందడం ఇదే తొలిసారి. 2020,2021లో భారీగా పెరిగిన ఆయన సంపద ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఒక దశలో క్రమం క్షీణించింది.

సోమవారం టెస్లా షేర్లు భారీగా పుంజుకున్నాయి. చైనాలో ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్ ను అమలు చేసేందుకు సూత్రప్రాయ ఆమెదం లభించిందనే వార్తలు షేర్ల ర్యాలీకి దోహదం చేశాయి. త్వరలో అందుబాటు ధరలో కారును తీసుకురానున్నమనే ప్రకటన కూడా దన్నుగా నిలిచింది. సోమవారం ఒక్క సెషన్ లోనే మస్క్ సంపద 18.5 బిలియన్ డాలర్లకు ఎగిసింది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీలోని ఏ సంపన్నుడికైనా ఇది 13వ అతిపెద్ద మార్కెట్ ఆధారిత రోజువారీ లాభం. మస్క్ ప్రస్తుతం 202 బిలియన్ డాలర్లో అత్యధిక సంపద కలిగిన మూడో వ్యక్తిగా కొనసాగుతున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్డ్, జెఫ్ బెజోస్, వరుసగా తొలి, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు.

మస్క్ సంపదలో అత్యధిక భాగం టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ షేర్ల నుంచే వస్తోంది. తాజా ర్యాలీకి ముందు వరకు టెస్లా షేర్లు ఈ ఏడాది నష్టాల్లో కొనసాగాయి. విక్రయాలు కుంగడం, ధరలు తగ్గించడం వంటి ప్రతికూల ప్రభావం చూపింది. అయితే స్పేస్ ఎక్స్ వాటాలు మాత్రం 2022 మధ్య నుంచి 2023 పూర్తయ్యే నాటికి 40శాతానికి పైగా పుంజుకున్నాయి.

ఇది కూడా చదవండి: పాకిస్తాన్ కు చెప్పే బాలాకోట్ దాడులు.!

Latest News

More Articles