Saturday, May 18, 2024

పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్..బాలికలదే హవా.!

spot_img

తెలంగాణ టెన్త్ వార్షిక పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్ బాగ్ లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పదోతరగతి ఫలితాలను విడుదల చేశారు. పదోతరగతి ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణతా శాతం నమోదు అయ్యింది. బాలికలు 93.23శాతం ఉత్తీర్ణత సాధించగా..బాలురు 89.42శాతం ఉత్తీర్ణతను సాధించారు. 3,927 పాఠశాల్లో 100శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. 6 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలు రాసారు. అందులో 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

కాగా ఈ సంవత్సరం పదోతరగతి వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 5,08, 385 విద్యార్థులు హాజరవ్వగా ..వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.

ఇది కూడా చదవండి: కొవిషీల్డ్‌తో సైడ్‌ఎఫెక్ట్స్‌ నిజమే..మొదటిసారి అంగీకరించిన ఆస్ట్రాజెనెకా .!

Latest News

More Articles