Friday, May 17, 2024

ప్రధాని మోదీ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.!

spot_img

2024లోకసభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ఓ జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా తన ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టారు. తాను ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయను అని చెప్పారు. ఇది దేవుడి తనకు ఇచ్చిన వరంగా చెప్పారు. బహుశా ఈ పని చేయడానికి దేవుడు తనను పంపాడని చెప్పుకొచ్చారు. తన తల్లి, తాను చదువకోని కుటుంబంలో పుట్టినట్లు చెప్పారు.

తన తల్లి ఏనాడు పాఠశాల ముఖం చూడలేదన్నారు. తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పిన మోదీ..ఇది చాలా పెద్ద దేశం కాబట్టి దేవుని చిత్తం కాకపోతే, మరొకటి కాదన్నారు. తనకు ఇద్దరు దేవుళ్లు ఉన్నారన్న ప్రధాని ఒకటి మనం చూడలేము..రెండవది ప్రజలే తన దేవుళ్లు అన్నారు. ప్రజానీకాన్ని భగవంతుని స్వరూపంగా భావిస్తున్నట్లు చెప్పారు. తనను వారికి సేవ చేసేందుకు పంపినట్లు చెపపారు. ప్రజల ఆశీర్వాదం పొందిన దేవుడిపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. ఇదే తన ఫిట్నెస్ సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి..ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదు

Latest News

More Articles