Monday, May 20, 2024

రెండు రోజుల సమావేశాల కోసం రూ. 4100 కోట్లు వృథా చేసిన మోడీ ప్రభుత్వం

spot_img

దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీలలో జీ-20 సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు దాదాపు 30 దేశాల నుంచి అతిథులు వచ్చారు. పలు దేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు హాజరయ్యారు. అయితే సమావేశాల నిర్వహణ పేరుతో మోడీ సర్కార్‌ వేల కోట్ల రూపాయల ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2023-24 బడ్జెట్‌లో జీ20 సమావేశాల కోసం రూ.990 కోట్లు కేటాయించారు. కానీ.. రూ.4,100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే కేటాయించిన దానికంటే.. దాదాపు 300 శాతానికి పైగా ఖర్చుచేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు సామాన్యుడు అల్లాడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కోట్ల రూపాయలను వృథాగా ఖర్చు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ సర్కార్‌ అవనసరపు అర్భాటాలకు పోయిందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సమావేశాలు నిర్వహించడం కోసం భారత్ మండపం పేరిత ఏర్పాటుచేసిన విడిది.. వర్షానికి వరద నీటితో నిండిపోయిందని, దానికోసం ఏకంగా రూ. 2100 కోట్లు ఖర్చు పెట్టారని నెటిజన్లు మండిపడుతున్నారు.

గత ఏడాది ఇండోనేషియాలో జీ20 సమావేశాలు జరుగ్గా.. ఆ దేశం రూ.364 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. రష్యా 2013లో కేవలం రూ. 170 మాత్రమే ఖర్చే చేసింది. కానీ భారత్ మాత్రం రూ. 4100 కోట్లు చేసింది. 2011 నుంచి ఇప్పటివరకు ఏ దేశం కూడా జీ 20 సమావేశాల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదు. ఇదంతా కేవలం మోడీ తన గొప్పలు చాటుకునేందుకే ఆర్భాటం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

Latest News

More Articles