Sunday, May 19, 2024

మోదీ సర్కార్ కఠిన చర్యలు.. కెనడాలో భారతీయ వీసా సేవలు నిలిపివేత..!!

spot_img

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు గుణపాఠం చెప్పేందుకు మోడీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. కెనడియన్ పౌరులకు వీసా సేవలను భారత్ తక్షణమే రద్దు చేసింది. భారత పౌరులు కెనడాకు వెళ్లి అక్కడ నివసించకూడదని ఇంతకుముందు భారతదేశం ప్రత్యేక సలహా కూడా జారీ చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందంటూ కెనడా నిరాధార ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

ఆస్ట్రేలియాతో సహా అనేక ఇతర దేశాల నుండి మద్దతు పొందేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ అందులో ట్రూడో విజయం సాధించలేకపోయాడు. అప్పటి నుండి, భారతదేశం-కెనడా వివాదం నిరంతరం పెరుగుతూనే ఉంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్‌పై ఆరోపణలు చేయడం..ఒక అగ్ర భారతీయ దౌత్యవేత్తను దేశం నుండి బహిష్కరించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

కెనడియన్ పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారతదేశం ఈ సేవను తక్షణం అమలులో నిలిపివేసింది. తదుపరి అప్‌డేట్‌ల కోసం వెబ్‌సైట్‌ చూడాలని కోరారు. ప్రస్తుతం భారత్‌ మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెనడాలో నివసిస్తున్న పలువురు ఉగ్రవాదుల జాబితాను కూడా ఎన్ఐఏ విడుదల చేసింది. తద్వారా భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పటికీ కెనడా వారికి మద్దతుగా నిలిచినందుకు ప్రపంచం మొత్తానికి బహిర్గతమవుతుంది.

Latest News

More Articles