Sunday, May 19, 2024

హీరో నవదీప్‌కు నోటీసులు!

spot_img

హైదరాబాద్:  మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. హీరో నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. డ్రగ్స్ వాడిన నిందితులను రిమాండ్ కు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న నవదీప్ పోలీసులకు అందుబాటులోకి రావడంతో.. తాజాగా నోటీసులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

Also Read.. క్రోమ్, ఎడ్జ్, ఫైర్‎ఫాక్స్ వంటి బ్రౌజర్‎లు ఉపయోగిస్తుంటే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే.!!

షాడో సినిమా యూనిట్ మెన్ ఉప్పలపాటి రవి ఇంకా పరారీలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. పలు పబ్ ల పైనా నిఘా కొనసాగుతుందని నార్కోటిక్ పోలీసులు వెల్లడించారు.  గచ్చిబౌలి లోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్ లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

Also Read.. బంపర్ డిస్కౌంట్..శాంసంగ్ 5జీ స్మార్ట్‎ఫోన్ పై ఏకంగా రూ.19వేలు తగ్గింపు..!!

పరారీలో ఉన్న మాడల్ శ్వేత కోసం గాలింపు కొనసాగుతుందని, కే పి చౌదరి లిస్ట్ లోనూ మాడల్ శ్వేతా పేరు ఉందన్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి కోసం వేట కొనసాగుతుందని, కేపి చౌదరి లిస్ట్ తో పాటు గతంలో బెంగుళూరు డ్రగ్స్ కేస్ లోనూ ఉన్నాడని నార్కొటిక్ పోలీసులు తెలిపారు.

Latest News

More Articles