Saturday, May 18, 2024

హైదరాబాద్ సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం

spot_img

హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు  ఇవాళ(బుధవారం) నుంచి పోలీసులు కొత్త ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. సిటీలో భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు. ప్రైవేట్ బస్సులు, లోకల్ లారీలు, టస్కర్లు డీసీఎంలు, ట్రాలీల పై ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు. ఇవాళ్టి నుంచి ప్రైవేట్ బస్సులకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతి. నేషనల్ పర్మిట్ ఉండి అధిక లోడ్ తో వస్తున్న లారీలకు సిటీ లో అనుమతి లేదు. లోకల్ లారీలకి రాత్రి 11 నుండి ఉదయం 7 వరకు అనుమతి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ తో ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ వివాహం..!!

Latest News

More Articles