Friday, May 17, 2024

ఆ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు రిక్రూట్‌మెంట్..నెలకు రూ. 2 లక్షల జీతం.!

spot_img

నిరుద్యోగులకు శుభవార్త. ఎన్టీపీసీలో ఈ4 గ్రేడ్ ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్/కన్‌స్ట్రక్షన్ రంగంలో డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి, అర్హత ఉన్న ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ Careers.ntpc.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభమైంది.దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 8గా నోటిఫికేషన్ లో పేర్కొంది.

NTPC రిక్రూట్‌మెంట్ 2024: ఖాళీల వివరాలు:

110 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్) – 20 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (మెకానికల్ ఎరేక్షన్) – 50 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (C&I ఎరేక్షన్) – 10 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (సివిల్ కన్స్ట్రక్షన్) – 30 పోస్టులు

వయో పరిమితి;

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఆసక్తి కలిగిన అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 40 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొంది.

దరఖాస్తు రుసుము:
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు తిరిగి చెల్లించలేని దరఖాస్తు రుసుము రూ. 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూబిడి, ఎక్సఎస్ఎం వర్గం, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇలా దరఖాస్తు చేసుకోండి:
-అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.ntpc.co.in కి వెళ్లండి
-ఇప్పుడు హోమ్‌పేజీలో కెరీర్‌ల ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
-“ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్/కన్‌స్ట్రక్షన్ (E4 స్థాయి), అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో డిప్యూటీ మేనేజర్‌గా అనుభవజ్ఞులైన నిపుణుల నియామకం” కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
-దీని తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను పూరించి మీకు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి
– దరఖాస్తు రుసుము చెల్లించి చివరకు ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఇది కూడా చదవండి: త్వరలోనే శాంసంగ్ గెలాక్సీ ఏ సీరిస్ నుంచి 2 సరికొత్త స్మార్ట్ ఫోన్లు..ధర, ఫీచర్లు ఇవీ..!

Latest News

More Articles