Monday, May 20, 2024

ఈ నెల 16న ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రారంభం..దక్షిణ తెలంగాణ రైతాంగానికి ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజు

spot_img

హైదరాబాద్: ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానుంది. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్  చేసి ప్రారంభించనున్నారు  సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు. 2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటి  ఎత్తిపోయనుంది. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి  ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. అదే రోజు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.  పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరుకానున్నారు.

Read Also.. తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అధ్యక్షతన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర  సచివాలయంలో… పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం” ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించు కుందామని పిలుపునిచ్చారు. ఎన్నో మొక్కులు మొక్కితే,  దైవకృపతో, ఇంజనీర్ల కృషి తో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందన్నారు.

Rain Alert .. తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి. పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదన్నారు సీఎం కేసీఆర్.

ఈ సమీక్షలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈలు తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.

Latest News

More Articles