Sunday, May 19, 2024

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

spot_img

తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలును అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌ సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. అక్టోబరు 16 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబరు 30 నుంచి నవంబర్ 6 వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

10వ తరగతి పరీక్షల షెడ్యూల్..

అక్టోబర్ 16న ఉదయం తెలుగు/కన్నడ/తమిళం/మరాఠి పరీక్ష. మధ్యాహ్నం సైకాలజీ పరీక్ష.

అక్టోబర్ 17వ తేదీన ఉదయం ఇంగ్లిష్, మధ్యాహ్నం ఇండియన్ కల్చర్ & హెరిటేజ్.

అక్టోబర్ 18వ తేదీన ఉదయం మ్యాథమెటిక్స్ పరీక్ష, మధ్యాహ్నం బిజినెస్ స్టడీస్

అక్టోబర్ 19న ఉదయం సైన్స్ & టెక్నాలజీ పరీక్ష జరగనుంది, మధ్యాహ్నం హిందీ పరీక్ష

అక్టోబర్ 20న ఉదయం సోషల్ స్టడీస్,మధ్యాహ్నం ఉర్దూ

అక్టోబర్ 10న ఉదయం ఎకనామిక్స్, మధ్యాహ్నం హోంసైన్స్

అక్టోబర్ 26వ తేదీన ఉదయం వొకేషనల్ సబ్జెక్టులు,మధ్యాహ్నం వొకేషనల్ సబ్జెక్టులు (ప్రాక్టికల్స్)

ఇంటర్ పరీక్షల షెడ్యూల్..

అక్టోబర్ 16వ తేదీన ఉదయం తెలుగు/ఉర్దూ/హిందీ పరీక్ష జరగనుంది.మధ్యాహ్నం హోంసైన్స్, అరబిక్.

అక్టోబర్ 17న ఉదయం ఇంగ్లిష్, మధ్యాహ్నం మాస్ కమ్యూనికేషన్, కెమిస్ట్రీ.

అక్టోబర్ 18వ తేదీన ఉదయం పొలిటికల్ సైన్స్, మధ్యాహ్నం పెయింటింగ్, జియెగ్రఫీ.

అక్టోబర్ 19న ఉదయం హిస్టరీ,మధ్యాహ్నం సైకాలజీ, ఫిజిక్స్.

అక్టోబర్ 20 ఉదయం కామర్స్/బిజినెస్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం మ్యాథమెటిక్స్.

అక్టోబర్ 21న ఉదయం బయాలజీ, ఎకనామిక్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం అకౌంటెన్సీ, సోషియాలజీ పరీక్షలు.

అక్టోబర్ 26 న ఉదయం వొకేషనల్ సబ్జెక్టులు (థియరీ),మధ్యాహ్నం ఎలాంటి పరీక్ష లేదు.

ప్రాక్టికల్ పరీక్షలు..

అక్టోబర్ 30 తేదీ నుంచి సెప్టెంబర్ 06వ తేదీ వరకు జనరల్ & వొకేషనల్ పరీక్షలు జరగనున్నాయి.

Latest News

More Articles