Monday, May 20, 2024

పోలీసుల మానవత్వం…గాయపడిన మావోయిస్టును చికిత్స కోసం తీసుకెళ్లిన ఖాకీలు..!!

spot_img

మావోయిస్టుల పట్ల కర్కశత్వమే కాదు మానవత్వం కూడా ఉంటుందని నిరూపించారు పోలీసులు. తీవ్రంగా గాయపడ్డ మావోయిస్టు పట్ట పోలీసులు మానవత్వాన్ని చూపారు. జార్ఖండ్ లోని హుస్సిపీ అడవిలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ వ్యక్తిని సహచర మావోయిస్టులు అక్కడే వదిలేసి వెళ్లారు. నొప్పితో విలవిల్లాడుతున్న ఆ మావోయిస్టును పోలీసులు భుజాలపై ఎత్తుకుని ఐదు కిలోమీటర్ల దూరం నడిచారు. ఆసుపత్రిలో చేర్చించి వైద్యం అందించారు. ఆపద సమయంలో శత్రువుకు కూడా ప్రాణదాం చేసిన పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కూకట్ పల్లిలో కాంగ్రెస్ కి షాక్.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా..!

ఇలాంటి ఘటనే గతంలో చత్తీస్ గఢ్ లోనూ చోటుచేసుకుంది. దంతెవాడలో గాయపడిన ఓ మావోయిస్టును చికిత్స కోసం అడవుల నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరం పోలీసులు మోసుకెళ్లారు. మంచంపై పోలీసులు తీసుకెళ్లడం చూసిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నదులు, కొండలు దాటుకుంటూ ఆ మావోయిస్టును జిల్లా ఆసుపత్రి తరలించారు. మావోయిస్టులు కూడా భారత పౌరులేనని…వారు తప్పు చేస్తే శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయని అప్పటి దంతేవాడ ఎస్పీ ఉన్నారు. ఒక భారత పౌరుడిగా వైద్యపరమైన చికిత్సను పొందే హక్కు కూడా తనకు ఉందన్నారు.

Latest News

More Articles