Sunday, May 19, 2024

కేసుల దర్యాప్తులో జాగిలాల పాత్ర కీలకం

spot_img

పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా  అన్నారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇవాళ(శుక్రవారం) 23 వ పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు డీజీపీ.. ఎన్నో కేసుల దర్యాప్తులో జాగిలాలు నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాయి. ఐఐటీఏ అందిస్తున్న శిక్షణ దేశంలోనే ఎంతో పేరు తెచ్చింది. వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు తమ రాష్ట్ర జాగిలాలకు శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల జాగీలాలకు ఐఐటీఏ శిక్షణ ఇస్తోంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఇటీవల జాతీయ స్థాయి డ్యూటీ మీట్ లో పథకాలు సాధించారని ప్రశంసించారు.

ఇది కూడా చదవండి:తప్పులు వెతకడం మాని 6 గ్యారంటీలు అమలు చేయండి

Latest News

More Articles