Sunday, May 19, 2024

పొలిటికల్ టూరిస్ట్ రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ పోస్టర్లు

spot_img

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ.. పలు పోస్టర్లు వెలిశాయి. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. దాంతో వరంగల్, ములుగులో పోస్టర్లు వెలశాయి. పోస్టర్ల ద్వారా రైతులపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిలదీశారు. పొలిటికల్ టూరిస్ట్ రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ పోస్టర్లు వేశారు. 10 హెచ్‌పీ మోటార్లు ఉన్న రైతులు కాంగ్రెస్‎కు, 10 హెచ్‌పీ మోటార్లు లేని రైతులు బీఆర్ఎస్‏కు ఓటేస్తారని పోస్టర్ల ద్వారా కాంగ్రెస్‎కు చురకలంటించారు. బోర్లకు 10 హెచ్‌పీ మోటర్లు బిగించుకొంటే మూడుగంటల్లో పొలం పారుతుందంటున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యాలన్ని తెలంగాణ రైతాంగం తప్పుబడుతోంది. వ్యవసాయానికి 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటార్లు తప్ప 10 హెచ్‌పీ మోటర్లు ఉండవని.. 30 లక్షల 10 హెచ్‌పీ మోటార్లు ఎవరు కొనిస్తారని ప్రతి వేదిక నుంచి కాంగ్రెస్ వైఖరిని సీఎం కేసీఆర్ ఎండగడుతున్నారు.

Read Also: మధ్యప్రదేశ్‌, చత్తీస్‎గఢ్‎లో ప్రారంభమైన పోలింగ్‌

అదేవిధంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో కూడా రాహుల్ గాంధీకి వ్యగంగా స్వాగతం పలుకుతూ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం అంటూ బ్యానర్లు కట్టారు. బ్యానర్‎లో తెలంగాణ అమరుల ఫోటోలు పెట్టి వాటి మధ్యలో రాహుల్ గాంధీ ఫోటో ఏర్పాటుచేశారు.

Latest News

More Articles