Sunday, May 19, 2024

మోదీ నన్ను క్షమించరని తెలుసు..!

spot_img

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది .అయితే తొలిజాబితాలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌తో సహా 34 మంది సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు దక్కలేదు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు తొలిజాబితాలో చోటు దక్కలేదు. ఈ విషయంపై ఆమె స్పందించారు. ప్రగ్యా సింగ్ తనకు అభ్యర్థిత్వాన్ని ఎందుకు తిరస్కరించారో స్పష్టం చేసింది.విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ‘మోదీజీకి నచ్చని కొన్ని పదాలను నేను వాడాను’ మోదీ నాకు అప్పుడే చెప్పారు నన్ను క్షమించరని..అందుకే నాకు తొలిజాబితాలో టికెట్ నిరాకరించారు అని ప్రగ్యా సింగ్ ఠాకూర్ అన్నారు.

బీజేపీ 195 మంది అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఈసారి భోపాల్ నుంచి అలోక్ శర్మకు టిక్కెట్టు ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాలకు గానూ 24 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు భోపాల్ నుంచి ప్రగ్యా ఠాకూర్, గుణ నుంచి కేపీ శర్మల టిక్కెట్లు కోత పడగా, ఆయన స్థానంలో జ్యోతిరాదిత్య సింధియా బరిలోకి దిగనున్నారు.

‘నేను ఇంతకు ముందు ఎప్పుడూ టిక్కెట్‌ అడగలేదు, ఇప్పుడు కూడా అడగలేదు. ఇది సంస్థ నిర్ణయం, టికెట్ ఎందుకు కట్ చేశారో, ఎలా కట్ చేశారో ఆలోచించకండి. నేనెప్పుడూ టిక్కెట్‌ అడగలేదు, ఇప్పుడు కూడా’ అని ప్రగ్యా సింగ్‌ అన్నారు. పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగితిస్తున్నట్లు చెప్పారు. తనకు టికెట్ ఇవ్వలేదనే అంశంపై ద్రుష్టి పెట్టకూడదని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. గాడ్సేను దేశభక్తుడని ప్రగ్యా గతంలో ఆమె అభివర్ణించడం వివాదస్పదమైంది. ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదన్నారు. ప్రగ్యా క్షమాపణలు చెప్పినా పూర్తిగా క్షమించలేకపోతున్నానని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆమెకు టికెట్ దక్కకపోవడం ఇదే కారణమని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: నేడు లోకసభ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేయనున్న బీఆర్ఎస్.!

Latest News

More Articles