Monday, May 13, 2024

వితంతువుని అయోధ్యకి ఆహ్వానించరా.. రాష్ట్రపతికి ఘోర అవమానం ?

spot_img

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయినా రాముడి దర్శనం కోసం అందరు తహతహలాడుతున్నారు. ప్రతి హిందువు సెంటిమెంట్ అయిన రామమందిరం ఆహ్వానాన్ని పవిత్రంగా భావిస్తున్నారు. చాలామంది సెలబ్రెటీలకు వెళ్లాలని ఉన్నా ఆహ్వానాలు అందటంలేదు. మమ్మల్నెదుకు ఆహ్వానించటం లేదని సోషల్ మీడియాలో సెలబ్రెటీలు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతికే ఈ అవమానం జరిగింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. దాంతో ఆదివాసీ బిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్టీ వర్గానికి చెందిన రాష్ట్రపతి ముర్మ్ గారిని బీజేపీ పెద్దలు రామమందిర ప్రారంభోత్సవానికి పిలవకుండా అవహేళన చేశారని అంటున్నారు. రాముడు సీత సమేతంగా అడవులలో జీవించినపుడు శబరి అనే ఆదివాసీ మహిళే ఆకలి తీర్చింది. రాష్ట్రపతి హోదాలో దేశ ప్రథమ మహిళగా ఉన్న ఒక ఆదివాసీ మహిళను ఎలా అవమాన పరుస్తారు అంటూ ఆగ్రహం చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఆదివాసీలు అందరు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. భర్త లేడని ముర్మ్ గారిని అవమాన పరుస్తున్నారు. భర్త లేకపోతే రామమందిరానికి ఆహ్వానించరా.. మరి మోడీకి భార్య లేదు కదా ఆయన ఎలా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ముర్మ్ గారిని గౌరవించి ఆమెను సాదరంగా ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest News

More Articles