Sunday, April 28, 2024

ప్రయాణికుడి చెంపపై కొట్టిన టీటీఈ సస్పెండ్‌

spot_img

లక్నో: రైలులో టికెట్‌ లేకుండా ప్రయాణించిన వ్యక్తిని అసభ్యకరంగా తిట్టడంతోపాటు కొట్టిన టీటీఈపై రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ టీటీఈని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధంచిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Also Read.. ఈ ఏడాది కూడా గూగుల్‌లో కొలువుల కోత!

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో ఒక వ్యక్తి టికెట్‌ తీసుకోకుండా బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. టికెట్లు తనిఖీ చేసే సమయంలో టీటీఈ ఈ విషయాన్ని గుర్తించాడు. ఈక్రమంలో ఆ వ్యక్తిని దారుణంగా తిట్టడంతోపాటు అతడి చెంపపై అనేకసార్లు కొట్టాడు. కొందరు ప్రయాణికులు ఈ ఘటనను రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read.. దళితబంధు రద్దు.. వాటర్ ట్యాంక్‌ ఎక్కి నిరసనలు

దీనిపై నెటిజన్లు స్పందించారు. టికెట్‌ లేకుండా ప్రయాణించిన వ్యక్తిది తప్పేనని.. కాకపోతే టీటీఈ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని దారుణంగా కొట్టడం దారుణమని అన్నారు. ఆ టీటీఈపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. రైల్వే మంత్రికి ట్యాగ్‌ చేశారు.  

 

Latest News

More Articles