Friday, May 3, 2024

420 హామీల అమలు కోసం ఒత్తిడి కొనసాగిస్తం.. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం మనదే

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో పార్టీ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి గుర్తు చేస్తూనే ఉంటామన్నారు.

Also Read.. క్లాసు వింటూనే కుప్పకూలిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థి

‘‘హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షంగా నిలదీస్తాం.  శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాము. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలి. శాసనమండలి సభ్యులు కూడా ఇప్పటికే వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలి. పార్టీని గ్రామస్థాయి నుంచి పోలీట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని పార్టీ అధ్యక్షులు భావిస్తున్నారు.

Also Read.. ఈడీ విచారణకి ఎమ్మెల్యే వివేక్..!

చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుంది. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేస్తాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలి. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలి. త్వరలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుంది. అందులో శాసన మండలి పార్టీ నేతలను ఎన్నుకుంటారు.’’ అని కేటీఆర్ తెలిపారు.

Latest News

More Articles