Friday, May 3, 2024

ఈడీ విచారణకి ఎమ్మెల్యే వివేక్..!

spot_img

V6 ఛానల్ అధినేత, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అక్రమ లావాదేవీల కేసుల్లో చిక్కుకున్నారు. రాజకీయ నాయకులకు భారీగా నిధులు సమకూరుస్తాడని ఈయనపై వార్తలుంటాయి. అప్పట్లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ఈటెల రాజేందర్ కి డబ్బులు సమకూర్చడని, అవి తిరిగి ఇవ్వనందుకే ఈటెలతో వివేక్ కి చెడిందని అంటారు. అయితే తాజాగా ఈ కేసుల్లో ఈడీ ఎదుట హాజరయ్యారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వివేక్. హవాలా, ఫెమా కేసుల విచారణలో భాగంగా ఈడీ ఎదుట హాజరయ్యారు.

మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్ లో ఈయనపై కేసు నమోదైంది. ఈ కేసు కోసమే ఈడీ విచారణకి వచ్చారు వివేక్. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో భారీ నిధుల డిపాజిట్లపై ఈ కేసు నమోదు అయింది. సరిగ్గా ఎలక్షన్స్ అప్పుడు జరిగిన ఈ ఉదంతంపై కేసు నమోదవ్వగా.. ఈడీ ఇన్విస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అందుతున్న మరో సమాచారం ప్రకారం విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రవేట్ సెక్యూరిటీ సంస్థలో 8 కోట్ల పైచిలుకు నిధులు డిపాజిట్లు జరిగాయట. అయితే.. ఆ నిధుల డిపాజిట్ల సంబంధించి వివేక్ ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారట.

Latest News

More Articles