Friday, May 17, 2024

కుబేర పోస్టర్ ఔట్..అదిరిపోయిన నాగ్ ఫస్ట్ లుక్.!

spot_img

కోలీవుడ్ హీరో ధనుష్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా మూవీ కుబేర. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై తెలుగులో భారీ అంచనాలు నెలకొన్నాయి.మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మూవీపై క్యూరియాసిటిని పెంచింది. కుబేర టైటిల్ కు భిన్నంగా ధనుష్ బిచ్చగాడి గెటప్ లో ఉండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందాని అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కింగ్ నాగార్జున గెటప్ ను కూడా రివీల్ చేశారు మూవీ మేకర్స్.

వర్షం కురుస్తున్న ఓ రోజు ..కంటైనర్ లారీ నిండా డబ్బులు. వర్షంలో గొడుగు పట్టుకుని నాగార్జున ఆ డబ్బును చూస్తుంటాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి వర్షపు నీటిలో నడుచుకుంటూ వెళ్తాడు. ఇంతలో ఒక నోటు కిందపడటం చూసి అక్కడే ఆగిపోతాడు. ఆ తర్వాత తన పర్స్ లో నుంచి కొంత డబ్బు తీసుకుని వెనక్కు వచ్చి కంటైనర్ లో పెట్టేస్తాడు. మొత్తం నాగార్జున లుక్ తోపాటు ఈ సీన్ కూడా బాగుంటుంది. నాగార్జున ఫస్ట్ లుక్ టీజర్ మూవీపై మరింత ఆసక్తిని పెంచింది.

ఇది కూడా చదవండి: నిప్పులు కక్కుతున్న ఎండలు..ఎండ వేడికి గుండె జాగ్రత్త.!

Latest News

More Articles