Friday, May 17, 2024

నిప్పులు కక్కుతున్న ఎండలు..ఎండ వేడికి గుండె జాగ్రత్త.!

spot_img

గుండె జబ్బు అనగానే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక బరువు వంటివి గుర్తుకువస్తాయి. అధిక ఉష్ణోగ్రత కూడా గుండెపోటుకు కారణమని మీకు తెలుసా. ఇది రోగనిరోధక వ్యవస్థకు చేటు చేస్తుందని..ఫలితంగా వాపు ప్రక్రియ పెరిగి, గుండె రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటుందని తాజా అధ్యయనం ఫలితాలు వెల్లడించాయి.

వేసవిలో అధిక వేడి మూలంగా వడదెబ్బ, పిక్కలు పట్టేయడం తలనొప్పి, చర్మం కమలటం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. అంతేకాదు ఇతరాత్రా సమస్యల ముప్పుకూడా పొంచి ఉంటుంది. ఉదాహరణకు గుండెజబ్బులు, అప్పటికే గుండె జబ్బులతో బాధపడుతుంటే తీవ్రమవుతుంటాయి. ఇంతకీ వేడికి గుండెకూ ఏంటీ సంబంధం వాపు ప్రక్రియే. గుండెజబ్బుల విషయంలో అధిక వేడిని అంతగా పట్టించుకోము కానీ ఇది ముఖ్యమైన ముప్పు కారకమేనని అధ్యయనానికి నేత్రుత్వం వహించిన డాక్టర్ డేనియల్ డబ్ల్యూ రిగ్స్ చెబుతున్నారు. వేసవిలో ఎండ ప్రభావానికి గురైనవారి రక్తంలో వాపు ప్రక్రియ సూచికల మోతాదులు పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే ఇన్ఫెక్షన్లతోపోరాడే బి కణాల సంఖ్య తగ్గుదల గమనార్హం. ఇమ్యూనిటీ సామర్థ్యాలూ తగ్గుతున్నాయనటానికి ఇది నిదర్శనం. ఇన్ఫెక్షన్లు, గాలి ద్వారా వ్యాపించే జబ్బుల వ్యాప్తికి ఉష్ణోగ్రత, తేమ కూడా కారణం అవుతాయి. అంటే అధిక ఉష్ణోగ్రత ప్రభావంతో ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ కాకుండా వాపు ప్రక్రియతో ముడిపడిన గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఖుష్బూ కూతురు ఎంట్రీ

Latest News

More Articles