Friday, May 17, 2024

మోడీ, రేవంత్ రెడ్డిలకు ఇవ్వని నోటీసులు..కేసీఆర్ కే ఎందుకు

spot_img

బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు లేని షరతులు బీఆర్ఎస్ కు ఎందుకు ఎన్నికల సంఘం విధిస్తోందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.బీజేపీ నేతలు ఏం మాట్లాడినా ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం లేదు.. కానీ కేసీఆర్ కు మాత్రం నోటీసులు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇవాళ( గురువారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఎన్నికల సంఘం కూడా బీజేపీ కనుసన్నల్లో పని చేస్తోందని ఆరోపించారు. తాము ఫిర్యాదు చేస్తే చేస్తే పట్టించుకోవడం లేదన్నారు.

మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రధాని మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌పై మాత్రం 48 గంటల పాటు నిషేధం విధించారన్నారు. ఈసీ బీజేపీ చెప్పనట్లుగా నడుస్తోందన్నారు కేటీఆర్. ఈ విషయంలో తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. దేశంలో బీజేపీ వాళ్లు జాతులు, మ‌తాల ఆధారంగా.. ప్ర‌ధాని, హోంమంత్రి మ‌తవైష‌మ్యాలు రెచ్చ‌గొట్టేలా మాట్లాడిన‌, విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేలా దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసినా, ప్ర‌త్య‌ర్థ పార్టీల‌ను బీజేపీ నాయ‌కులు బూతులు తిడుతున్నా.. వాళ్ల  అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ ముస్లింల‌పై విషం చిమ్ముతూ.. ప్ర‌చారం చేస్తున్నా ఎలాంటి చర్యా లేదన్నారు. ముస్లింలే ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఇటీవల మోడీ అన్నారని, ఈ వ్యాఖ్యలపై 25 వేలమంది పౌరులు ఈసీకి ఫిర్యాదు చేస్తే కనీసం ఆయనకు నోటీసులివ్వలేదని ఆరోపించారు. మోడీకి ఎన్నికల సంఘం భయపడుతోందన్నారు కేటీఆర్

సిరిసిల్లలో ఎండిన పంటలు చూసిన తర్వాత కేసీఆర్ ఆవేదనతో మాట్లాడినట్లు చెప్పారు. ఆవేదనలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసినందుకు… 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారన్నారు కేటీఆర్.

ఇది కూడా చదవండి: ఇంద్రకరణ్ రెడ్డి.. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య లేదు

Latest News

More Articles