Friday, May 17, 2024

నాకూ ఇంగ్లీష్ రాదు.. రేవంత్ పై ట్రోలింగ్ పీక్స్.. సీరియల్ నటి పోస్ట్

spot_img

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాషపై పెద్దఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది. నేషనల్ మీడియాతో రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చారు. రేవంత్ ఇంగ్లీష్ చూసి నేషనల్ టీవీ యాంకర్ రాహుల్ లాంటి వాళ్ళు కావాలనే రేవంత్ తో ఎగతాళిగా మాట్లాడారు. సాటి తెలంగాణ పౌరులుగా అందరికి ఇది అవమానమే. రేవంత్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే మన రాష్ట్రం పరువు పోకుండా ఉండేది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు. కేసీఆర్, కేటీఆర్, కవితలు తెలంగాణ రాష్ట్రం తరపున జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో మాట్లాడేవారు. ఈ ముగ్గురి కమన్యునికేషన్ స్కిల్స్ చూసి హిందీ మీడియానే ఆశ్చర్యపోయేది. ఇక విదేశాల్లో అయితే కేటీఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్టు పై మంచి అవగాహనతో భారీ పెట్టుబడులని ఆకర్షించేవాడు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఘోరంగా ఫెయిల్ అవ్వటమే కాకూండా తెలంగాణని నవ్వులపాలు చేశాడు.

తనకి ఇంగ్లీష్ రాదని తెలిసినా నేషనల్ మీడియా ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వటం తప్పు. కనీసం ప్రిపేర్ అయ్యి ఉంటే డ్యామేజీ కాస్తైనా తగ్గేది. ఇక మరోవైపు తన పక్కన మంచి కమన్యునికేషన్ స్కిల్స్ ఉన్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడు. అతనికి మీడియా అడ్రెస్ చేసే ఛాన్స్ ఇవ్వాల్సింది. కానీ పబ్లిసిటీ పిచ్చితో రేవంత్ రెడ్డి వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడి తన పరువే కాకుండా తెలంగాణ పరువు తీశాడు. ఇక దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున మెసేజిలు వస్తున్నాయి. తాజాగా ఒక సీరియల్ నటి కూడా తనకు ఇంగ్లీష్ రాదని పోస్ట్ పెట్టింది. ఇంజినీరింగ్ చేసినా.. నా కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ అని పెట్టి ట్రోల్ చేసింది. బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యగా మెప్పిస్తున్న దీపిక రంగరాజు ఈ పోస్ట్ పెట్టింది. ‘ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌లో పట్టాపొందిన దీపిక.. తనకి ఇంగ్లీష్ రాదంటూ ఆసక్తికర విషయాలను తెలియజేసింది.

Latest News

More Articles