Friday, May 17, 2024

క్లాసు వింటూనే కుప్పకూలిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థి

spot_img

నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది గుండెపోటుతో మరణించారు. దీనంతటికి కారణం మన జీవనశైలే. ఒక్కప్పుడు 60ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు పట్టుమని పదేండ్లు కూడా లేని పిల్లలకు గుండెపోటు వస్తున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ యువకులు మరణించిన సంఘటనలు చూశాం. ఇలాంటి విషాదకరమైన ఘటనే మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌లో క్లాస్ వింటూనే ఓ విద్యార్థి గుండెపోటుతో కూలిపోయాడు.

Read Also: రామాలయం కట్టిన భక్త రామదాసుకే కష్టాలు తప్పలేదు.. నేనేంత

సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధి అనే విద్యార్థి మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం ఇండోర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ లో చదువుకుంటున్నాడు. అయితే రాజా రోజూ మాదిరిగానే ఈ రోజు కూడా క్లాస్‌కు వెళ్లాడు. క్లాస్‌ వింటూనే ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఛాతి నొప్పితో కిందపడిపోయాడు. పక్కనే ఉన్న విద్యార్థులు గమనించి సాయం అందిచేందుకు ప్రయత్నించగా.. కాసేపటికే కుప్పకూలాడు. ఇది అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. అయితే వెంటనే అతని స్నేహితులు స్పందించి, లోధిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

Latest News

More Articles