Friday, May 17, 2024

రామాలయం కట్టిన భక్త రామదాసుకే కష్టాలు తప్పలేదు.. నేనేంత

spot_img

మంత్రులు, ఎమ్మెల్యేలు.. పోలీసులు చెప్పింది చేయడం సబబు కాదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులు నిబంధనలకు లోబడి పని చేయాలన్నారు. ‘కాంగ్రెస్ కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతోంది. సాక్షాత్తూ నాపై, నా కుటుంబ సభ్యులపై ఒక రౌడీ షీటర్‎తో ప్రైవేట్ ఫిర్యాదు ఇప్పించి కేసులు నమోదు చేయించారు. ఆలయం కడితే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నోటీసులు ఇచ్చారు, హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాం. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్అండ్‎బీ అతిథి గృహం, ఆలయం అన్నీ ఒకే సర్వే నంబర్‎లో ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన నాపై కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదు. గుడిని ఆనుకునే ఆలయ అవసరాల కోసం కాంప్లెక్స్ కట్టాం, అది ఆలయం ఆస్తి తప్ప నా సొంత ఆస్తి కాదు. ప్రభుత్వ భూమిలో గుడి కట్టాం, రామాలయం కట్టిన భక్త రామదాసుకే కష్టాలు తప్పలేదు’ అని గండ్ర అన్నారు.

Read Also: రామమందిరం పోస్టల్‌ స్టాంప్‌లను విడుదల చేసిన ప్రధాని మోడీ

Latest News

More Articles